శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 12:58:51

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య: మంత్రి సబిత

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య: మంత్రి సబిత

ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల శ్రేయస్సుకోసం విజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన వైజ్ఞానిక పరికరాలు సర్కారు బడుల్లో ఉన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని పలు పాఠశాలల్లో నూతన భవనాలను మంత్రి అజయ్ కుమార్ ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యారంగంపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. అయితే స్వరాష్ట్రంలో విద్యను ప్రతి చిన్నారికి అందించేందుకు తాము కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. 

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాదపాలెంలో రూ.2.20 కోట్లతో కొత్తగా నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం, చింతకాని మండలంలోని కేజీబీవీ పాఠశాల, బోనకల్‌ కొత్తగా నిర్మించిన కేజీబీవీ పాఠశాల, ముదిగొండలోని కేజీబీవీ పాఠశాలలో భవనాలను ప్రారంభించారు.

VIDEOS

logo