పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు
Minister Harish rao | డయాలసిస్ రోగులకు సేవలందించే విషయంలో రాష్ట్రం ముందుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్‌ను ప్రభుత్వ దవాఖానల్లో
హైదరాబాద్: డయాలసిస్ రోగులకు సేవలందించే విషయంలో రాష్ట్రం ముందుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్‌ను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గతంలో ఇది కార్పొరేట్ హాస్పిటళ్లకే పరిమితమైందన్నారు. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలోని న్యూరో విభాగంలో రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్యులు నిత్య విద్యార్థులేనని చెప్పారు. కొత్తగా వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా పేద ప్రజలకు సింగిల్ యూజ్ ఫిల్టర్ సిస్టం ద్వారా డయాలసిస్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 10 వేల మందికి డయాలసిస్ చేస్తున్నామని వెల్లడించారు. డయాలసిస్ చేయించుకునేవారికి బస్‌పాస్, పెన్షన్లు, ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. డయాలసిస్‌పై ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు వెచ్చిస్తున్నదని చెప్పారు.
పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రతిఏటా ఆరోగ్య శ్రీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. శుద్ధిచేసిన తాగునీరు అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రాథమిక దశలోనే గుర్తించి రోగాలు రాకుండా చూసుకోవాలన్నారు.
కిడ్నీట్రాన్స్ప్లాంటేషన్లు అత్యధికంగా నిమ్స్‌లో జరుగుతున్నాయన్నారు. నిమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. దవాఖానలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. వైద్య సిబ్బంది ఓనర్‌షిప్‌తో పనిచేయాలని, పేదలకు మంచి వైద్యం అందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

