శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:38

40 వేల మంది ఇంటికి

40 వేల మంది ఇంటికి

  • రాష్ట్రంలో రికవరీ రేటు 76.8% 
  • ఒక్కరోజే 1,007 మంది డిశ్చార్జి
  • తాజాగా 1,640 కేసులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యంతోపాటు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటడంతో వైరస్‌ నుంచి వేగంగా కోలుకుంటున్నారు. ఈ మహమ్మారి నుంచి శుక్రవారం ఒక్కరోజే 1,007 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇలా క్షేమంగా ఇండ్లకు చేరినవారి సంఖ్య 40,334కు చేరింది. రికవరీ రేటు 76.8 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మరోవైపు ఒక్కరోజే రికార్డుస్థాయిలో 15,445 నమూనాలను పరీక్షించారు. ఇందులో 1,640 పాజిటివ్‌గా తేలాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 683 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 

రంగారెడ్డి జిల్లాలో 135, సంగారెడ్డిలో 102, కరీంనగర్‌లో 100, పెద్దపల్లిలో 98, కామారెడ్డిలో 56, నాగర్‌కర్నూల్‌లో 52, మహబూబాబాద్‌లో 44, నల్లగొండలో 42, వరంగల్‌ అర్బన్‌లో 36, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 30, జయశంకర్‌ భూపాలపల్లిలో 24, మెదక్‌, వరంగల్‌ రూరల్‌లలో 22 చొప్పున, రాజన్న సిరిసిల్లలో 20, వనపర్తి, నిజామాబాద్‌లలో 18 చొప్పున, జగిత్యాలలో 17, ములుగులో 14, ఖమ్మంలో 13, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, భద్రాద్రి కొత్తగూడెంలో 11 చొప్పున, జనగామలో 10, ఆదిలాబాద్‌లో 9, సిద్దిపేట, వికారాబాద్‌లో 8 చొప్పున, మంచిర్యాల, గద్వాలలో 7 చొప్పున, నిర్మల్‌లో ఒక కేసు నమోదయ్యాయి. కరోనాతోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల 8 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 455కు పెరిగింది. ఇది మొత్తం కేసుల్లో 0.86 శాతమేనని అధికారులు తెలిపారు. మరోవైపు యాక్టివ్‌కేసులు 22 శాతానికి తగ్గాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు


శుక్రవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,640
52,466  
డిశ్చార్జి అయినవారు
1,007
40,334
మరణాలు
8455
చికిత్స పొందుతున్నవారు
-11,677logo