Telangana | రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ.. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.
Happy to share that Corning, one of the world’s leaders in material sciences has decided to invest in Telangana to setup a manufacturing plant to make Gorilla Glass for smartphones, for the first time in India 😊
Investment size of ₹934 Crore will employ 800 people but more… pic.twitter.com/baYUXByFTl
— KTR (@KTRBRS) September 1, 2023