లింగంపేట, జనవరి 30 : దీర్ఘకాలిక రుణం తీసుకున్న రైతు తిరిగి చెల్లించడం లే దంటూ ఆయన పొలాన్ని వేలానికి పెట్టిన ఘ టన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతెలో శుక్రవారం చోటు చేసుకున్నది. బా ధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏలాల బాల్‌రెడ్డి తనకున్న 3.20 ఎకరాల భూమిపై 2016లో నల్లమడుగు సహకార సంఘంలో రూ.5లక్షలు దీర్ఘకాలిక రుణం తీ సుకున్నాడు. ఈ రుణం మొత్తం రూ.10 లక్షలకు పైగా బకాయి ఉందని, తిరిగి చెల్లించాలని అధికారులు ఇటీవల నోటీసులు జారీచేశారు. రుణం చెల్లించడానికి తనకు సమయం ఇవ్వాలని రైతు వేడుకున్నా వినకుండా సహకార బ్యాంకు అధికారులు పొలాన్ని వేలం వే స్తామని చెప్పారు. ఆ పొలంలో శుక్రవారం తెల్లజెండాలు పాతారు. ఈ వ్యవహారంపై బ్యాంకు మేనేజర్ రంజిత్‌ను వివరణ కోర గా.. బాల్‌రెడ్డి నోటీసులకు స్పందించకపోవ డంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు, కోర్టు అనుమతితో భూమి వేలం వేస్తున్నట్టు వెల్లడించారు.