హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గెజిటెడ్ హెచ్ఎం పోస్టులను ప్రిన్సిపాల్స్‌గా మార్చాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులను ప్రిన్సిపాళ్లుగా సంబోధిస్తున్నదని, మన రాష్ట్రంలోనూ హెచ్ఎం పోస్టు పేరును మార్చాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజుగంగారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. నాలుగైదు మండలాలను ఒక విద్యా డివిజన్‌గా విభజించాలని, ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు వేర్వేరుగా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టును మంజూరుచేయాలని, వివిధ విభాగాల్లో 20 ఏండ్లుగా ఉన్న ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని, కేజీబీవీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఏజీ జీపీఎఫ్‌కు అనుమతించాలని వినతిపత్రాన్ని సమర్పించారు.
కాలేజీలతో ఒప్పందాలు రద్దు
హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): వ్యవసాయ కోర్సుల నిర్వహణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)తో పలు ప్రైవేటు కాలేజీలకు, సంస్థలకు ఉన్న ఒ ప్పందాలను రద్దు చేసినట్టు వీసీ ప్రొఫెసర్ జా నయ్య తెలిపారు. 2022 జూలై వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు చేసుకున్న అవగాహన ఒప్పందాల ను పునఃపరిశీలన చేసినట్టు తెలిపారు. ఆ ఒప్పందాలు విశ్వవిద్యాలయం ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నందున రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.