హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన కాకతీయ టెక్స్టైల్ పార్క్, ఐటీ పార్క్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలు, సందర్శకుల విడిది కోసం హైదరాబాద్‌లో మాదిరిగా ఎన్కన్వెన్షన్ సెంటర్, త్రీస్టార్ హోటల్ నిర్మాణం చేపట్టాలని మండలిలో బీఆర్ఎస్పక్ష ఉపనేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ వంటి పెద్ద నగరానికి పర్యాటకులు, పారిశ్రామికవేత్తల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నారు. 2022 సంవత్సరంలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 10 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ మోడల్లో ఎన్కన్వెన్షన్, త్రీస్టార్ హోటల్ నిర్మాణానికి అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అనుమతిచ్చారని గుర్తుచేశారు.