కూల్చింది తేల్చకముందే పనులా?
కాంగ్రెస్ పాలనలో పేదల ఇండ్లకే కాదు చారిత్రక కట్టడాలకూ రక్షణ లేకుండా పోతున్నది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని రేవంత్ సర్కార్ ఐదు నెలల క్రితం బుల్డోజర్తో నేలమట్టం చేసింది. అప్పటినుంచి కూల్చిన గుడి విషయంలో ఏమీ తేల్చని ప్రభుత్వం.. ఉన్నఫలంగా శనివారం ముగ్గు పోయడం అనుమానాలకు తావిస్తున్నది.
- ఐదు నెలల క్రితం కాకతీయులనాటి శివాలయంపైకి బుల్డోజర్..
- స్థలాన్ని చదును చేస్తూ.. డ్రైవర్ తెలియక కూల్చేశాడని కవరింగ్!
- తాజాగా అదేచోట ముగ్గు పోయడంపై చర్చ
వరంగల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో పేదల ఇండ్లకే కాదు చారిత్రక కట్టడాలకూ రక్షణ లేకుండా పోతున్నది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని రేవంత్ సర్కార్ ఐదు నెలల క్రితం బుల్డోజర్తో నేలమట్టం చేసింది. అప్పటినుంచి కూల్చిన గుడి విషయంలో ఏమీ తేల్చని ప్రభుత్వం.. ఉన్నఫలంగా శనివారం ముగ్గు పోయడం అనుమానాలకు తావిస్తున్నది. సైనిక్ స్కూల్‌ను ఆనుకొని ఉన్న ఆ స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టుబట్టడంతో నిర్మాణ పనులకు ఉపక్రమించిన సమయంలో గుడి కూలింది. స్థలాన్ని చదును చేస్తుండగా డ్రైవర్ చూసుకోకుండా పురాతన గుడిని కూల్చివేశారని, అక్కడ గుడి ఉన్న విషయం తెలియకపోవటం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు.
పురావస్తు శాఖ అనుమతి లేకుండా, సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకొని కాంట్రాక్టర్ ఇష్టారీతిగా శిల్పసంపదను కూల్చివేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడి కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తదితర నేతలు, ప్రజాసంఘాలు, చరిత్రకారులు మద్దతుగా నిలిచిరు. గుడి కూల్చివేతపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా ప్రభుత్వం అదే చోట ముగ్గు పోయడం అనుమానాలకు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

