హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
సరిహద్దు రాష్ర్టాల్లో నివసిస్తున్న లేదా చికుకున్న తెలంగాణవాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కంట్రోల్‌రూమ్ నిరంతరం పనిచేస్తుందని, నిరంతరాయంగా సేవలను అందిస్తుందని తెలిపారు. సహాయం కావాల్సిన వారు కింది నంబర్లలో సంప్రదించాలని గౌరవ్ ఉప్పల్ సూచించారు.
Control Room