హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సహకారం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా ప్రభుత్వాన్ని కోరారు. మలేషియా పర్యటనలో భాగం గా బుధవారం ఆ దేశ మంత్రి జోహరి అబ్దుల్ ఘనీతో, పామాయిల్ బోర్డు చైర్మన్ అహ్మద్ పర్వేజ్ గులామ్ ఖాదీర్తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభు త్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహకాలు అందిస్తున్నదని చెప్పారు. మాట్రో య్ చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్తోనూ తుమ్మల భేటీ అయ్యారు. మలేషియాతో వ్యవసాయపరంగా వ్యాపార సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా సెరి రీజల్ మాట్లాడుతూ.. తమ దేశంలో నూకలకు అత్యంత డిమాండ్ ఉందని, తెలంగాణ నుంచి సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.