హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టీవీవీపీ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించనందుకు నిరసనగా 19న టీవీవీపీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వరర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, ప్రధాన కార్యదర్శి నరసింహ సోమవారం ప్రకటన విడుదల చేశారు.
శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు అందక పస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. వేతనాలు చెల్లించాలని 10వ తేదీ నుంచి ఏరియా దవాఖానలు, సీహెచ్సీల్లో రోజూ గంటపాటు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. దీంతో 19న కమిషనర్ కార్యాలయ ముట్టడికి సిద్ధమైనట్టు వెల్లడించారు.