
వీణవంకలో నిరంతర వైద్య సేవలు
వీణవంక, సెప్టెంబర్ 3: అడుగంగనే హామీ ఇచ్చి.. 4గంటల్లోనే మంజూరు చేయించి.. వారంలోనే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు మంత్రి హరీశ్‌రావు. వీణవంక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందేలా చూడాలని, పోస్టుమార్టం సదుపాయం కల్పించాలని ప్రజలు ఏండ్లుగా కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈటలను అడిగినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత ఆదివారం దేశాయిపల్లికి వచ్చిన హరీశ్‌రావుకు స్థానికులు విన్నవించగా వెంటనే స్పందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, అదేరోజు సమస్యకు పరిష్కారం చూపారు. దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తూ, పోస్టుమార్టం సెంటర్లో ఫ్రీజర్లు మం జూరు చేయిస్తూ ఉత్తర్వులు జారీచేయించారు. శుక్రవారం దవాఖానలో 24 గంటల వైద్య సేవలు, పోస్టుమార్టం కేంద్రంలో ఫ్రీజర్లను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రారంభించారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో మండల ప్రజలు సంబురపడుతున్నారు.