పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లికి చెందిన జూపల్లి దామోదర్‌రావు ఏర్పాటు చేసుకొన్న కంటెయినర్ ఇల్లు ఆకట్టుకొంటున్నది. 22.2 గజాల విస్తీర్ణంలోనే ఒక బెడ్రూం, అటాచ్డ్ బాత్రూం, హాల్, కిచెన్లను ఏర్పాటు చేశారు. దీనిని రూ.2.80 లక్షలకు హైదరాబాద్‌లో తయారు చేయించినట్టు దామోదర్‌రావు తెలిపారు. ఆర్డర్ చేసిన వారంలోనే కంపెనీవారే ఫ్రీ డెలివరీ చేస్తున్నారని వెల్లడించారు. చిన్నచిన్న ఇండ్ల నిర్మాణానికి లక్షల్లో ఖర్చవుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి రెడీమేడ్ ఇండ్లు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. – సుల్తానాబాద్ రూరల్