Constable | వినాయక్‌నగర్, మే 18: వడ్డీ వ్యా పారి అవతారమెత్తిన ఓ కానిస్టేబుల్ అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు. చీటీల వ్యాపారం చేస్తూ, సకాలంలో డబ్బులు చెల్లించని వారి ఆస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. నిజామాబాద్ రూర ల్ ఎస్సై మహ్మద్ ఆరీఫ్ వివరాల మేర కు.. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేష న్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత తన కూతురికి ఆరోగ్యం బా గాలేకపోవడంతో చికిత్స కోసం డబ్బు లు అవసరమయ్యాయి. ఈ విషయం మెండోరా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీనియర్ కానిస్టేబుల్ కలివరి గంగాధర్‌కు తెలిసింది.
దీంతో కానిస్టేబుల్ గంగాధర్ సదరు మహిళ వద్దకు వచ్చి ‘మీ వద్ద ఏదైనా ప్రాపర్టీ ఉంటే నా పేరి ట సేల్ డీడ్ చేయండి. డబ్బులు ఇస్తా ను’ అని నమ్మించాడు. ఆ మహిళ రూ.20 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్ ను కానిస్టేబుల్ పేరిట సేల్‌డీడీ చేసింది. కానిస్టేబుల్ రూ.8 లక్షలు ఇచ్చి, 5% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కండీషన్ పెట్టాడు. ఆ మహిళ సకాలం లో వడ్డీ చెల్లించడం లేదని.. సదరు కానిస్టేబుల్ రికవరీ కోసం పెట్టుకున్న వ్యక్తులను ఆమె ఇంటికి పంపించి వేధించసాగాడు. వీరి వేధింపులు ఎక్కువకావడంతో ఆ మహిళ శనివారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కే గంగాధర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో గంగాధర్‌పై కేసు నమో దు చేసినట్టు ఎస్సై ఆరీఫ్ తెలిపారు.