తిమ్మాపూర్/ పెద్దపల్లి కమాన్, ఆగస్టు 10: అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ భాస్కర్‌కు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు అనిల్‌కుమార్(36) 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.
ప్రస్తుతం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్నాడు. అనిల్ కొందరు తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. తిరిగి అవసరానికి వారు ఇవ్వకపోగా, వేధింపులకు గురిచేయడంతో ఈ నెల 31న కరీంనగర్ జిల్లా అలుగునూర్ శివారులో పురుగులమందు తాగి ఇంటికి వెళ్లాడు. కుటుంబసభ్యులు దవాఖానలో చేర్పించగా, పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు.