సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 3: గన్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై చోటుచేసుకున్నది. ఎస్పీ పారితోష్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ ఏడాదిగా స్థానిక పట్టణ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
సందీప్ ఆన్లైన్ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకోగా అతడి తల్లి భూమి అమ్మి కొన్ని అప్పులు కట్టినట్టు తెలుస్తున్నది. కల్హేర్‌లో ఇల్లు మాత్రమే ఉన్నందున అప్పులు కట్టలేక సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సందీప్‌కు అప్పులు ఇచ్చిన తోటి సిబ్బంది తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని సమాచారం. సందీప్ తండ్రి 10 ఏండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి భూదేవి కష్టపడి ఇద్దరు పిల్లలు సందీప్, శ్రీవాణిని చదివించింది.