నాగర్ కర్నూల్ : కాళేశ్వరంపై ( Kaleshwaram ) కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, వాస్తవాలను ప్రజల్లో తీసుకు వెళ్లవల్సిన బాధ్యత ప్రతి నాయకులు, కార్యకర్తలపై ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి ( Kaipal Reddy) , జైపాల్ యాదవ్( Jaipal yadav ) ,హర్షవర్ధన్ రెడ్డి ( Harsavardan Reddy ) పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం పై వీడియో ప్రజెంటేషన్ అనంతరం నాగర్ కర్నూల్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్( Congress ) పార్టీ గోదావరి నదిపై అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేయడం వల్ల తెలంగాణ సస్యశ్యామలం అయిందని అన్నారు. అలాంటి కాళేశ్వరం పై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు.
అబద్దపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కకు పెట్టి రాజకీయ కక్ష్య సాధింపులే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు. ఏపీలో పోలవరం 3 సార్లు కూలితే ఒక్కసారి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదని, కాళేశ్వరంలో భాగమైన మేడి గడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగితే రిపేర్ చేసే వెసులుబాటు ఉన్న దాన్ని వారి రాజకీయ లబ్ది కోసం స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాద్దాంతం చేస్తుందని రేవంత్ ప్రభుత్వాని దుయ్యబట్టారు.
రేవంత్ పాలన అంత ఒక టీవీ సీరియల్ లా నడుస్తోందని, మొన్నటివరకు ఫార్ములా వన్ కేసు , నిన్న ఫోన్ ట్యాపింగ్, నేడు కాళేశ్వరం పై తప్పుడు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. తమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని ఎందుకు మార్చిన విషయాన్ని హరీష్ రావు చక్కగా వివరించారని కొనియడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.