పాన్‌గల్, జనవరి 25: బీఆర్ఎస్ ఎంపీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల తర్వాత వనపర్తి జిల్లా పాన్‌గల్ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డిపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు శ్రీను, ఆది స్వామి ఎడ్లబండ్లకు వాడే కందెన ఆయిల్ చల్లి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎంపీపీ అనుచరులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎంపీపీ ప్రాణ భయంతో సమీపంలోని పోలీస్ స్టేషన్లోకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసుల హామీతో శాం తించారు.
దళితబంధు రాకపోవడానికి ము ఖ్యకారణం తానేనంటూ గతంలోనూ తనపై రెండు సార్లు వాళ్లు దాడికి యత్నించారని శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎంపీపీ శ్రీధర్‌రెడ్డిని పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గులాబీ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. గతనెల పెద్దకొత్తపల్లి మం డలం గంట్రావుపల్లిలో మాజీ సైనికుడు మల్లే శ్ హత్య మరువకముందే మళ్లీ ఎంపీపీపై కాం గ్రెస్ నేతలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఈ దాడి వెనుక మంత్రి జూ పల్లి కృష్ణారావు హస్తముందని ఆరోపించారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.