సీఎం కేసీఆర్‌ది, బీఆర్ఎస్ది రైతుల ఎజెండా అయితే.. కాంగ్రెస్ నేతలది బూతుల ఎజెండా. బూతులు మాట్లాడటం చాలా సులువు. కానీ మిషన్ భగీరథతో నీళ్లు ఇవ్వడం చాలా కష్టం. బూతులు మాట్లాడటం చాలా సులువు.. రైతుబంధు, కరెంట్ ఇవ్వడం, అంబేడర్ విగ్రహం కట్టడం చాలా కష్టం. అయినా ఆ పనులన్నీ సీఎం కేసీఆర్ చేసి చూపించారు. – మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘ఈ సారి మళ్లీ కేసీఆర్ రాకపోతే హైదరాబాద్ కూడా అమరావతిలా అయిపో తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుం టున్నారట. నేడు అమరావతిలో ఏమైంది? మొత్తం బిజినెస్ అవుట్’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష దంపతులు, కార్మిక నేత గోపాల్ తెలంగాణ భవన్లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సెంచరీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేదని చెప్పారు. రాష్ర్టానికి బలహీనమైన నా యకత్వం ఉండాలో? బలమైన నాయకత్వం ఉండాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ వైపు బలమైన సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ఉంటే.. కాంగ్రెస్ వైపు ఎవరున్నారో నేటికీ తెలియదని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానం లో ఉన్నదని గుర్తుచేశారు. నాడు హైదరాబాద్‌లో కరెంట్ కావాలని పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసినట్టు గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తం గా 24 గంటల నిరంతర కరెంట్ సీఎం కేసీఆర్ ఇస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని స్పష్టంచేశారు. బాలీవుడ్ హీరో, పంజా బ్ ఎంపీ సన్నీ డియోల్ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారని అన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అర్థమైన అభివృద్ధి.. కాంగ్రెస్ గజనీలకు అర్థం కావడంలేదని చురకలంటించారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఖాతా తెరవదు
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎందరో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, వారందరికీ పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఉప్పల్, మేడ్చల్, మలాజిగిరి సహా హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. వస్తున్న సర్వే రిపోర్టుల ప్రకారం.. జీహెచ్ఎంసీలో కాం గ్రెస్ ఖాతా తెరవబోదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్ అవుట్‌తో.. కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరినవారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీపీసీసీ మాజీ కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ శిరీష, ఉద్యమకారుడు గోపాల్, ప్రభాకర్‌రెడ్డి, లంబు శ్రీనివాస్, విష్ణుమూర్తి, సంజీవ్‌రెడ్డి, మల్లికార్జునగౌడ్, సంజయ్‌జైన్, అరుణ, కే శ్రీనివాస్, అనిల్‌కుమార్ వంటి ప్రముఖ నేతలు, వందల సంఖ్య లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఇన్చార్జ్ రావుల శ్రీధర్‌రెడ్డి, శాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎవరీ సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి
సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి 1993 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఉప్పల్ ఎన్ఏఎస్ఐ ప్రెసిడెంట్‌గా చేశారు. కాంగ్రెస్‌లో చేరి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మల్కాజిగిరి పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ 2012-2016, పీసీసీ సెక్రటరీగా 2016-2021 వరకు కొనసాగారు. సోమశేఖర్‌రెడ్డి ఒక సోషల్ యాక్టివిస్ట్. యువసేన ఫౌండేషన్‌ను 2002లో ప్రారంభించి.. ఉప్పల్‌లో మంచినీళ్లు లేని దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా హార్ట్ ఎటాక్ వచ్చిన నిరుపేదలకు ఉచితంగా మందులు, వైద్య సేవ అందిస్తున్నారు. కొవిడ్-19లో రూ.6 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు నిత్యావసరాలు అందించారు. అప్పుడు నేషనల్ మీడియా కూడా సోమశేఖర్‌రెడ్డిపై కవర్ స్టోరీ చేసింది. ఆయన భార్య శిరీష ఏఎస్రావు నగర్ నుంచి కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో గెలిచారు. నాటి నుంచి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు.
నేను రేవంత్ బాధిత సంఘం అధ్యక్షుడ్ని
నేను కాంగ్రెస్‌లో ఆస్తులమ్ముకొని, భార్యా బిడ్డలను వదిలేసి రేవంత్ కోసం పనిచేశా. ఎంతో కష్టపడి పనిచేసిన నన్ను రేవంత్ న్యాప్కిన్లా వాడి పడేశాడు. నాలాంటి బాధితులు ఎందరో ఉన్నారు. ‘రేవంత్ బాధితుల సంఘానికి’ నేను అధ్యక్షుడ్ని. రేవంత్ గుర్తుపెట్టుకో.. నా శక్తిని తక్కువ అంచనా వేశావు.. హరీషన్న వదిలిన బాణంగా చెబుతున్నా.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ నీ ఓటమి కోసం పోరాడుతా. ఉప్పల్ గెలుపుపై ఎవ్వరికీ అనుమానాలొద్దు. ఎమ్మెల్యేగా బండారు లక్ష్మారెడ్డి ఫిక్స్. నా అభిమానులు, కార్యకర్తలు, వారి బంధువులంతా సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను గెలిపించేందుకు కృషి చేయాలి.
– సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి
‘టూ..’ గాళ్లను తరిమికొట్టాలె!
ముదిరాజ్ మీటింగుల మా బాధలు చెప్పుకున్నం. నేను అమ్ముడుపోయిన అంటున్నరు. తెలంగాణ తల్లిపాలు తాగినోడి లెక్క నాది. మొన్న కేసీఆర్ సారు.. ‘నా పానం బాలేపోతే ముదిరాజ్ తల్లి పాలు తాగి పెరిగిన’ అన్నడు. నేను అదే కృతజ్ఞతతో ఉన్న. ‘మా తండ్రి త్యాగం అసలే మరువం/పాలిచ్చి సాకిన రొమ్మును విడువం/కూటమి కుట్రల బానిస బతుకుల అస్తిత్వాన్ని అగ్గితో కడిగేస్తం.. తెలంగాణ నేలమీద వేద్దాము వేటు.. కారు గుర్తుకు వేద్దాము ఓటు’ పాటందుకున్న. రాష్ట్రం కోసం తండ్రి వంటి కేసీఆర్ చేసిన త్యాగం వృథా పోవద్దు. రాష్ట్రం కోసం కొట్లాడినోడు ఉండాలని ప్రజలనుకుంటున్నరు. వాడెవడో వచ్చిన పచ్చని తెలంగాణను.. పచ్చడి చేస్తామంటే ఊరుకుందామా? మన రాష్ర్టానికొచ్చే టూ.. గాళ్లను తరిమి కొట్టాలె. కేసీఆర్ సార్‌ను హ్యాట్రిక్ సీఎంను చెయ్యాలె. వాళ్లు ఎన్ని తిట్టినా కేసీఆర్ సారు మనకు పెద్ద దిక్కు అయిండు. కంచంల అన్నమైండు. వాళ్లు చేసే ట్రిక్కులకు సారు హ్యాట్రిక్‌కు ఆగదు. హరీషన్న వంటి బాహుబలులుండగా ఆయనకు తిరుగులేదు. మన కేసీఆర్ సార్‌ను మించిన మెగాహీరో లేరు. సారొక్కడే బాధపడకుండా.. మనమంతా బరువు మొయ్యాలె.
– బిత్తిరి సత్తి (రవికుమార్ ముదిరాజ్)