MLA Shankaraiah | హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్య కలెక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధరణి వచ్చాక జిల్లాల్లో కలెక్టర్లు కలెక్షన్ కింగ్‌లు అయ్యారంటూ అనుచితంగా వ్యాఖ్యానించారు. ధరణిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పట్టా మార్పిడి కోసం, విరాసత్ కోసం వీఆర్ఏలు, పట్వారీలు వందో రెండో వందలో తీసుకునే వాళ్లని, కానీ ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్లు కలెక్షన్ కింగ్లయ్యారు అని ఆరోపించారు.