Dava Vasantha Suresh | మేడిగడ్డ పిల్లర్లు కుంగితే.. చిల్లర రాజకీయాలకు పాల్పడ్డ కాంగ్రెస్ : దావ వసంత సురేష్
Dava Vasantha Suresh | తెలంగాణకు జీవనాధార కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు పాల్పడిందని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు.
జగిత్యాల : తెలంగాణకు జీవనాధార కాళేశ్వరం ( Kaleshwaram ) ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు పాల్పడిందని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ (Dava Vasantha Suresh) విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలకు హైకోర్టులో వెలువడిన తీర్పు చెంప మీద కొట్టినట్టు ఉందని పేర్కొన్నారు. ఈ తీర్పు యావత్ తెలంగాణ ప్రజలు, రైతన్నల విజయమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రెండు పంటలకు సరిపడే నీళ్లు ఇచ్చి లక్షల ఎకరాల సాగు చేశారని అన్నారు.
తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణ బాగు కోరుకునే వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణను నాశనం చేయాలని గాని నిర్వీర్యం చేయాలనే గాని ఆలోచన కేసీఆర్కు , బీఆర్ఎస్కు ఉండదని అన్నారు. కుంగిన పిల్లర్లను రెండున్నర సంవత్సరాల పాటు రిపేరు చేయకుండా రైతన్నలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. పరిపాలన చేతకాక కేసీఆర్పై, వారి కుటుంబం పై విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, రూరల్ మండల అధ్యక్షుడు అయిల్నేని ఆనంద్ రావు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవారి శివ కేసరి బాబు, కోరుగాంటి రాము, సామల్ల శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు , ఓద్ది రామ్ మోహన్, కచ్చు హరీష్, గుండా మధు, ఎల్లా రాజన్న, హరీష్, శ్రీరాముల గంగాధర్, అనురాధ కస్తూరి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

