కరీంనగర్ కమాన్చౌరస్తా, అక్టోబర్ 3: కరీంనగర్లోని రాంనగర్ మార్క్ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమం రసాభాసగా మారింది. రాజకీయాలకు అతీతంగా వేడుకల నిర్వహణకు పోలీసులు, మార్క్ఫెడ్ అధికారులు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించగా, సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ శమీ పూజలో పాల్గొన్నారు.
కొందరు జై పొన్నం అంటూ నినాదాలు చేయగా, తాము చేస్తున్న కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం పట్ల అసహనంగా ఉన్న స్థానికులు జై గంగుల అంటూ నినదించారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగా, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి సభ కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాగానే అభిమానులు జై గంగుల అని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని అందరినీ అదుపుచేశారు.