Kale Yadaiah | గో బ్యాక్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. వికారాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తల నిరాహార దీక్ష
Kale Yadaiah | చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాలె యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేటలో మండల కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు.
Kale Yadaiah | చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాలె యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేటలో మండల కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన కాలె యాదయ్య.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా కొండల్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఆయన గతంలో అనేక కేసులు పెట్టించాడని గుర్తుచేశారు. యాదయ్య చేరిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్యను సీఎం రేవంత్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్దకు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించారు. కాగా, పార్టీని వీడుతున్న కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదని.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అని వ్యాఖ్యానించారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని తెలిపారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- chevella
- Congress
- Kale Yadaiah
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

