ఖైరతాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సమయంలో కళాకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనువోజు వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,500మంది కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏడాది గడిచినా ఎలాంటి ప్రకటన చేయడం లేదని మండిపడ్డారు. ఆరురోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నకిరకంటి కిరణ్‌కుమార్, గజవెల్లి ప్రతాప్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్, మహేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.