Asaduddin Owaisi: రైతు బంధును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది: అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi: రైతు బంధు స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఆ స్కీమ్ చాలా ఏళ్ల నుంచి అమలులో ఉందని, ఇప్పటికే అమలులో ఉన్న స్కీమ్‌ను ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఎంపీ అసద్ ప్రశ్నించారు. రైత బంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: రైత బంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఆ స్కీమ్ చాలా ఏళ్ల నుంచి అమలులో ఉందని, ఇప్పటికే అమలులో ఉన్న స్కీమ్‌ను ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఎంపీ అసద్ ప్రశ్నించారు. ఒకవేళ ఇది కొత్త స్కీమ్ అయి ఉంటే, అప్పుడు దాని గురించి భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంటుందని, ఇదేమీ కొత్త స్కీమ్ కాదు అని, అకస్మాత్తుగా ఆ స్కీమ్‌ను అడ్డుకోవడం అంటే, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని స్పష్టమవుతోందని అసదుద్దీన్ అన్నారు. రైతు బంధును అడ్డుకోవడం అంటే .. కాంగ్రెస్ పార్టీ తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోందని అసద్ ఆరోపించారు.
#WATCH | On EC telling Telangana Govt to stop disbursements under Rythu Bandu scheme, AIMIM president Asaduddin Owaisi says, “Congress party objected to it. This is an ongoing scheme and has been in implementation for years. What objection does the Congress party have against an… pic.twitter.com/0ZtQfefiy0
— ANI (@ANI) November 27, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

