Congress Party | హైదరాబాద్ : తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సీట్లు ఖరారు అయ్యాయి. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సీట్లు ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్, కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, డాక్టర్ సయీద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించారు. వీరంతా రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడే అనిల్ కుమార్ యాదవ్.