హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట నుంచి చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. మహారాష్ట్రలోని భీవండి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి అధినేత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎన్సీపీ మైనార్టీ సెల్ జాతీయ కార్యదర్శి అరిఫ్ అజ్మీ, ఫజిల్ అన్సారీ, భీవండి కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త ఇర్ఫాన్ మోమిన్, కాంగ్రెస్నేత, ఎన్జీవో సీనియర్ నాయకుడు అర్ఫత్షేక్, ఎన్సీపీ థానే జిల్లా ఉపాధ్యక్షుడు మక్సూద్ఖాన్ తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.