నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వచ్చే సీజన్ కోసం యూరియా నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతులు క్యూలో నిల్చుంటున్నారని నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘రైతులు అమాయకులు. వచ్చే సీజన్ కోసం… యూరియా నిల్వ చేసుకుందాం అనకుంటున్నారు.
అందుకే లైన్లు కడుతున్నారు’ అని అన్నారు. ‘యూరియా ఇచ్చేది కేంద్రం… పంచేది రాష్ట్ర ప్రభుత్వం. పాకిస్థాన్‌తో యుద్దం వల్లే యూరియా రాలేదని.. బిజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పాడు. తమ తప్పిదమని బీజేపీ వాళ్లే ఒప్పుకున్నారు’ అని అన్నారు. రఘువీర్ వ్యాఖ్యలపై రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.