Congress Party | మహాదేవపూర్(కాళేశ్వరం), మే 15 : కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాల్లో భాగంగా వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న క్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో ఫ్లెక్సీలలో లేకపోవడంతో దళిత నాయకుని అవమానించారంటూ ఆయన అనుచరులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఒక్కసారిగా సీఎం సభ రసాభాసగా మారింది. గత వారం కరీంనగర్లో జరిగిన విభేదాలతో పాటు ఈరోజు జరిగిన విభేదాలతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గ భేదాలు బట్టబయలు అయ్యాయి.
పుష్కరాలకు దళిత ఎంపీకి నో ఎంట్రీ
ఆందోళన చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అనుచరులు
సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరణ సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుచరులు ఆందోళన
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీని ఎందుకు పిలవలేదని… pic.twitter.com/9SCeMPEyTa
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2025