Kagajnagar Municipality | కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తనకు ఓటు లేకున్నా ఎక్స్అఫిషీయో కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ అక్రమంగా తప్పుడు ఓటు నమోదు చేయించుకున్నారు. దీనికి సంబంధించి ఆధారాలను సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బయటపెట్టారు.
ఈ 16న జరిగే ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నాడని.. దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కోనేరు కోనప్ప ఆరోపించారు. ఎక్స్అఫీషియో ఓటు వేసేందుకు ఎమ్మెల్సీ దండే విఠల్ చేత తప్పుడు మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు నమోదు చేయించిందని తెలిపారు. దండే విఠల్‌కు ఎక్స్అఫీషియో ఓటు వేసేందుకు అర్హత లేదని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే దర్యాప్తు జరిపి, విఠల్ ఓటును తొలగించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు కోనేరు కోనప్ప ఫిర్యాదు చేశారు. విఠల్‌ను ఎక్స్అఫీషియో సభ్యుడిగా కొనసాగించకూడదని డిమాండ్ చేశారు.
ఎక్స్ అఫిషియో కోసం అక్రమంగా తప్పుడు ఓటు నమోదు చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు లేకున్నా, ఎక్స్ అఫిషియో కోసం అక్రమంగా ఓటు నమోదు చేసుకున్నాడని ఆధారాలతో బయటపెట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తనకు ఓటు లేకున్నా, ఎక్స్… pic.twitter.com/XWG5jcuENK
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2026