హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం ఇంటర్ విద్యాశాఖతో హెటిరో ఫార్మాస్యూటికల్స్ బుధవారం ఎంవోయూ కుదుర్చుకున్నది. నాంపల్లిలోని కార్యాలయంలో ఇంటర్ విద్యా డైరెక్టర్ అభిలాష అభినవ్.. హెటిరో వైస్ప్రెసిడెంట్ జయపాల్రెడ్డి ఒప్పంద పత్రాలు పరస్పరం మార్చుకున్నారు.
ఈ ఒప్పందం ద్వారా పరిశ్రమలతో అనుసంధానం, క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని అభిలాష తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఎంక్యా నాయక్, రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ ప్రిన్సిపాల్ జ్యోత్స్నారాణి, మాధురి, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.