యాప్ బేస్డ్ రవాణా సేవలలో పనిచేస్తున్న ప్రతి డ్రైవర్, డెలివరీ కార్మికుల కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్క్ యూనియన్, తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ఇచ్చిన పిలుపుమేరకు గిగ్ వర్కర్లు బుధవారం చేపట్టిన సమ్మె సక్సెస్ అయ్యింది. కార్మికుల సమ్మెతో నగరంలో ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, తదితర డిజిటల్ ఫ్లాట్‌ఫాం కంపెనీలకు చెందిన సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వం వెంటనేఆయా కంపెనీలతో మాట్లాడి గిగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.
– సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)