హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థులను(Congress MLC candidates) కాంగ్రెస్ అధిష్ఠానం ఖారారు చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్(Adanaki Dayakar), బల్మూరి వెంకట్(Balmuri Venkat)కు అధిష్ఠానం ఈ మేరకు సమాచారమందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఎల్లుండి తుది గడువు కాగా, ఈ నెల 29న ఎమ్మెల్య కోటా ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, అద్దంకి దయాకర్ గతంలో రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే బల్మూరి వెంకట్ హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.