ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిరసన సెగ తగిలింది. సాగునీరందక పంటలు ఎండుతున్నా పట్టించుకోవడంలేదని రైతులు నిలదీశారు.
రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతుభరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గర్శకుర్తిని మండల కేంద్రం చేస్తానంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.