బీజేపీ పాలన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంతో పోల్చితే బీజేపీ పాలనలో జీడీపీ తగ్గుదల విషయాన్ని ప్రజలకు వివరించినందుకు సీఎంకు సీఎల్పీ నేత భట్టి
విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో, ఎక్కడైతే విమానం దిగితే ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు బాగా అభివృద్ధి చెందుతుందని భావిస్తారో అక్కడికే పెట్టుబడులు వస్తాయని, జీఎస్డీపీ పెరుగుతుందని సీఎం చెప్పిన మాటలతో భట్టి ఏకీభవించారు. సెర్ప్, మెప్మాలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్కేల్ ఇవ్వడంతో పాటు తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నందుకు భట్టి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఫైర్ అ య్యారు. మహాత్మాగాంధీని పట్టపగలు తుపాకీతో కాల్చిచంపిన వాళ్లు దేశాన్ని పాలిస్తుంటే సిగ్గుపడాలని అన్నారు. పైగా గాంధీని చంపిన గాడ్సేను వారు పొగుడుతున్నారని దుయ్యబట్టారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, దీనిపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. మంగళవారం రాష్ట్ర ద్రవ్య వినిమ య బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ఆనాడు పరాయిపాలకులు తమపై పోరాడిన గాంధీజీకి ఎంతో గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాగానే ఆరునెలల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర మత చాందసవాదులు గాంధీని పట్టపగలు తుపాకీతో కాల్చిచంపారని అన్నారు. దేశ సంపదను, ముఖ్యంగా ప్రజల సం పద అయిన ప్రభుత్వ రంగసంస్థలను కేంద్రం తెగనమ్ముతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రైల్వే లు, ఎల్ఐసీలను కూడ అమ్మేస్తున్నారని అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అమ్మి ప్రజలకు పంచుతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామ న్ ప్రకటించారని గుర్తుచేశారు. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నది ప్రజల సంస్థలను వెస్ట్ ఇండియా (అంబానీ, అదానీ) కంపెనీలకు కట్టబెట్టడానికా? అని నిలదీశారు. ఆ పార్టీలో ఇద్దరు (బీజేపీలో మోదీ, అమి త్ షా), బయట ఇద్దరు (అంబానీ, అదానీ), ఈ దేశం ఆ నలుగురి కోసమేనా?అని విస్మయం వ్యక్తం చేశారు.
సింగరేణి కోల్‌మైన్స్‌ను ప్రైవేట్ వాళ్లకు ఎలా ఇస్తార ని ప్రశ్నించారు. మీ రాష్ట్రం(గుజరాత్)లోనేమో ఇవ్వ రు.. తెలంగాణ బొగ్గు గనులు ఎలా ప్రైవేట్‌కు ఇస్తార ని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. సింగరేణి తెలంగాణ ఆత్మ అని స్పష్టం చేశారు. విభజన చట్టంలో పే ర్కొన్న విధంగా కేంద్రం ఇవ్వాల్సినవి 8 ఏండ్లుగా ఎం దుకు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి ఆందోళనకరంగా ఉందని అన్నారు. దేశంలో 171 మె డికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ కు ఒక్క కాలేజీ ఇవ్వలేదని చెప్పారు. ఒక్కో కాలేజీకి రూ.200 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇదే తీరు గా దేశవ్యాప్తంగా 80 నవోదయ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం రాష్ట్రానికి ఒక్క కాలేజీని కూడా ఎందు కు ఇవ్వదని అడిగారు. దేశానికి మనవంతుగా నిధులిస్తున్నామని, మరి మనకు ఐఐఐటీలు, ఐఐటీలు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ఎండగట్టారు. పునర్విభజన బిల్లులో ఐటీఐఆర్ ప్రాజెక్టును పొందుపరిచినా 8 ఏండ్లుగా ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కావాలంటే కన్సిడర్ చేస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో చెప్పారు.. మరి ఎందుకు ఇవ్వరని
కేంద్రాన్ని భట్టి ప్రశ్నించారు.