వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెబ్బేరు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పరమయ్యగారి ఎల్లారెడ్డి, పెబ్బేరు మండలం రంగాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ మిద్దె రామచంద్రమ్మ, మాజీ వార్డు మెంబరు మణెమ్మ, లక్ష్మి సహా 150 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.