జనగామ, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16నెలలు గడుస్తున్నా పాలన విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేదల కోసం ఉచిత వైద్యం అందిస్తున్న తీరును మెచ్చి బీఆర్ఎస్లో చేరినట్టు పేర్కొన్నారు.