వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ప్రజలు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కంటెస్టెంట్ క్యాండిడేట్ బర్ల వాణి, రవి కుమార్ దంపతులు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.