దేవరకద్ర, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానించారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర జాతీయ జెండాను పట్టణ అధ్యక్షుడు సయ్యద్ఫారుక్ అలీ జాతీయ జెండాను తలికిందులుగా ఎగురవేశారు.
గమనించిన నాయకులు వెంటనే జాతీయ జెండాను సరిచేశారు. జాతీయ జెండాను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.