వట్పల్లి, సెప్టెంబర్ 8 : కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకలకు పోలీస్‌స్టేషన్ వేదికగా మారింది. ఎస్సై సమక్షంలోనే కాంగ్రెస్ మండల అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్‌కట్ చేసి అక్కడే పంచి పెట్టడం మరోమారు చర్చనీయాంశం గా మారింది. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నా.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా పోలీస్ యంత్రాంగంలో మార్పురావడం లేదు. తాజా గా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా.. వట్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్జో షి పుట్టిన రోజు సందర్భంగా ఆదివా రం వట్పల్లి ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబు ళ్లు అంతా కలిసి కేక్‌కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్లో జరగడం.. అదీ కూడా ఎస్సై దగ్గరుండి వేడుకలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. పార్టీలకతీతంగా ప్రజలకు సమన్యా యం చేయాల్సిన పోలీసులే ఇలా బ హిరంగంగా ఓ పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇటీవల జరిగిన పలు ఘటనలు ..
ఈ ఏడాది ఏప్రిల్ 15న భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఠాణాలో కాళేశ్వరం ఆలయ మాజీ చైర్మన్ గుడాల శ్రీనివాస్ సినిమా పాటలు పెట్టి డాన్స్చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎస్సైతోపాటు సిబ్బందిని బదిలీ చేశారు. కొన్ని రోజుల తర్వాత సీఐ కూడా బదిలీ అయ్యారు.
ఆరు నెలల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీంతో ఎస్సైపై బదిలీ వేటుపడింది.
గత నెల 19న గ్రేటర్ వరంగల్‌లో ని కాశీబుగ్గ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన మంత్రి కొండా సురేఖ బర్త్‌డే వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి జనాల మధ్యే పటాకు ల మోత మోగించారు. ఈ ఘటనలో ఓ బాలికతోపాటు మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓ ఏసీపీతోపాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సిబ్బందిపై విచారణ కొనసాగుతున్నది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా పోలీస్ యంత్రాంగంలో మార్పు రావడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.