నాగర్‌కర్నూల్/కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 28: కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యా ఘటన మరవకముందే, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో బీఆర్ఎస్ నేత, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జు ల పరమేశ్నాయుడుపై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిం గోటం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, పరమేశ్నాయుడు గురువారం రాత్రి సా తాపూర్లో స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటుచేయిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత శివరావుతోపాటు 50 మంది కలిసి ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో పరమేశ్నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న గ్రామస్తులు కలుగజేసుకొని అడ్డుకోవడంతో పరమేశ్నాయుడు తృటి లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు ఆయనను నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు శుక్రవారం దవాఖా న నుంచి డిశ్చార్జి చేశారు. దాడి సమయం లో పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోలేదని, పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నలో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పరమేశ్నాయుడుపై కాంగ్రెస్ కార్యకర్తలు గతంలోనూ దాడు లు చేశారు. 2023 నవంబర్ 29వ తేదీన పోలింగ్ ఉన్న రోజు బీఆర్ఎస్ శ్రేణులను, ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు పరమేశ్నాయుడు ఇంటిపై కొంద రు దుండగులు దాడి చేశారు. కార్యకర్తల సహాయంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నా యకులతో తనకు ప్రాణహాని ఉన్నదం టూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కా నీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవిత పరామర్శ
కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన గుజ్జుల పరమేశ్నాయుడును శుక్రవారం ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. ఇలాంటి దాడులకు భయపడవద్దని, ధై ర్యంగా ఉండాలని కవిత ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తున్నాడన్న కోపంతోనే కాంగ్రెస్ నేతలు అదు ను చూసి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. తన పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దుం డగులు దాడి చేయడం హేయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. పరమేశ్‌పై దాడి చేసిన నిందితులను వెం టనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు హత్యా రాజకీయాలను మానుకోవాలని హితవు చెప్పారు.