Banakacherla | హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్లో బనకచర్ల చిచ్చు మొదలైందా? సీఎం మాట విని గుడ్డిగా ముందుకుపోతే.. తెలంగాణలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని భావిస్తున్నారా? బాబుకు లబ్ధి చేకూర్చేందుకు తామెందుకు బలవ్వాలని ఆందోళన చెందుతున్నారా? సీఎం తన పద్ధతి మార్చుకోకుంటే మరో నీళ్ల ఉద్యమం తప్పదా? ఇప్పుడీ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. బనక చర్లకు అనుకూలంగా సీఎం రేవంత్రెడ్డి పావులు కదిపినప్పటి నుంచి కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నది. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాలకు ఎమ్మె ల్యేలు జత కడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు ఎమ్మె ల్యేలు నేరుగా, మరికొందరు వేర్వేరు మార్గాల ద్వారా దక్షిణ తెలంగాణలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక నేత వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. తెలంగాణ అంటే గిట్టని చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటకాగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న సదరు ఎమ్మెల్యేలు ఆ నేత వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలి సింది. ఎన్నికల వేళ తమిళనాడులో ఆ బీజేపీకి, ఆంధ్రలో టీడీపీకి లాభం చేసేందుకు ఇక్కడ కాంగ్రెస్ను బలపెట్టడం దేనికని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, ఎమ్మెల్యేల అసంతృప్తి పట్ల ఆ నేత అంతగా ఆసక్తి చూపలేదని తెలిసింది.
కాళేశ్వరంతో ఇప్పటికే తీరని అపకీర్తి
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అను కూల నిర్ణయాలు వెలువడితే తమకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన యువ ఎమ్మెల్యేలు కొందరు ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అసలు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేను, నిజామా బాద్ జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మె ల్యేను కలిసి తమ గోడు చెప్పుకున్నట్టు తెలి సింది. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇచ్చే అవ కాశం ఉన్నప్పటికీ కేసీఆర్ మీద ద్వేషంతో ప్రభుత్వం కావాలనే రైతుల భూములు ఎండబెట్టిందనే అపప్రథను ఇప్పటికే మూటగట్టుకున్నామని, ఇప్పుడు బనకచర్ల నిర్మాణానికి అంగీకరిస్తే ఇక గ్రామాల్లోకి కూడా తమను రానివ్వరని నల్లగొండ జిల్లాకు చెందిన కీలక మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా గెలిపించి ఏడాదిన్నర కాలం దాటిందని, కానీ ఇప్పటి వరకు నియోజక వర్గాల్లో కోటిన్నర రూపాయల అభివృద్ధి పనులు కూడా చేపట్టలేకపోయామని ఆవే దన వ్యక్తంచేసినట్టు తెలిసింది. 10 ఎకరాల వరకు రైతుభరోసా పథకం పడింది కాబట్టి గ్రామాల్లో తిరుగుదామంటే బనకచర్లతో ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడిందని ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. గురు దక్షిణకు ఇదా మార్గం! అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కీలక నేతను వేర్వేరు మార్గాల ద్వారా సంప్రదించినట్టు సమా చారం. చంద్రబాబుతో మనం రాసుకుపూ సుకు తిరుగుతున్నామనే సంకేతాలు ఇప్ప టికే ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెల కొన్నదని, ఇప్పుడు గురుదక్షిణ కింద ప్రజల హక్కులను బలిపెడితే వారు సహిం చబోరని చెప్పినట్టు తెలిసింది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసి నట్టు సమాచారం. మహిళలకు ఒక్క ఉచిత బస్సు ప్రయాణం మినహాయిస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విజయవం తంగా అమలు చేసిన పథకం ఒక్కటీ లేదని ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని సదురు కీలక నేతకు వివరించినట్టు తెలిసింది. ఈనే పథ్యంలోనే బనకచర్లను తీసుకొచ్చి ముందు పెడితే ప్రజలు మనల్ని ఎలా నమ్ముతారని ప్రశ్నించినట్టు సమాచారం.
బీజేపీ కోసం బలిపెడుతున్నారు.
గోదావరిలో మన వాటా నీళ్లను ఆక్ర మంగా తరిలించే ప్రాజెక్టు బనకచర్ల అని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు దాన్ని నమ్ముతున్నారని ఈ నేప థ్యంలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మన ప్రభుత్వం సంప్రదింపులు జరపడం తీవ్ర ప్రతికూలంగా మారిందని సదరు కీలక నేతకు వివరించినట్టు తెలిసింది. ప్రజలు వద్దు అంటున్నప్పుడు మనం వ్యతి రేకించాల్సింది పోయి, మీదేసుకొని ప్రాజె క్టుకు అనుకూలంగా పావులు కదపడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని చెప్పినట్టు తెలిసింది. బనకచర్ల ప్రాజెక్టు మీద పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరపడంతో ప్రభుత్వా నికి వీసం ఎత్తు ప్రయోజనం కూడా లేదని, త్వరలో ఎన్నికలు జరగబోయే తమిళనా డులో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికే ప్రయోజనం అని, అటు వంటి ప్రాజెక్టును భుజానికి ఎత్తుకోవడం ఎవరి ప్రయోజనాల కోసమో ఆలోచించా లని కోరినట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణ యంతో ఇటు గోదావరి పరీవాహక ప్రాం తం, అటు కృష్ణానది పరీవాహక ప్రాంతా లు కలిపి దాదాపు 30 నియోజకవర్గాలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని, బనక చర్లకు అనుమతులిస్తే ఆయా నియోజకవ ర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కనీస డిపా బిట్లు రావని సదరు కీలక నేత దృష్టికి తీసు కొచ్చినట్టు తెలిసింది. తమరే దీనిపై ఒక నిర్ణయం తీసుకోసుకోవాలని, మీరు ఎటు వంటి నిర్ణయం తీసుకున్నా మా 30 మంది ఎమ్మెల్యేలం కట్టుబడి ఉంటామని స్పష్టం. చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల అభిప్రా యాన్ని తెలంగాణ ప్రజల అభిప్రాయంగా వెంటనే అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలని వారు ప్రాధేయపడినట్టు సమాచారం.
ధైర్యం చేయని కీలక నేత
ఎమ్మెల్యేల అసంతృప్తి, అభ్యర్ధన పట్ల సదరు కీలక నేత అంతగా ఆసక్తి చూపలే దని సమాచారం. బనకచర్ల అంశం క్యాబి నెట్ నిర్ణయంగా చెప్పినట్టు తెలిసింది. వ్యక్తి గతంగా తాను బనకచర్లకు అనుకూలం కాదని చెప్తూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన చర్చలు వద్దని కానీ, కావాలని కానీ ఏమి చెప్పలేనని తన నిస్సహాయతను వ్యక్తపరిచి నట్టు తెలిసింది. మీరు ఎలాంటి అభ్యంత రాలు వ్యక్తం చేసినా సాంకేతిక కమిటీ రిపోర్టు వచ్చే లోపే చేయాలని మాత్రమే సూచించినట్టు సమాచారం.