అమరావతి : తీర్థయాత్రలకు బయలు దేరిన నెల్లూరు( Nellore ) జిల్లా వాసుల బస్సుకు ప్రమాదం జరిగి ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. లారీని ఓవర్ టేక్ చేయబోయిన యాత్రీకుల ప్రైవేట్ బస్సు ( Private Bus ) ప్రమాదానికి గురైంది. మృతులు హజరయ్య, వెంకటేశ్వర్లు, పద్మావతిగా గుర్తించారు.
జిల్లాలోని సంగం,ఆత్మకూరు, దుత్తలూరు గ్రామాలకు చెందిన 43 మంది ప్రయాణికులు కాశీ యాత్రకు బయలు దేరారు. ఆదివారం గయ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వారణాసికి వెళ్తుండగా ఔరంగాబాద్ జిల్లాలో లారీని ఓవర్టేక్ చేయబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రులు నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని బిహార్ ప్రభుత్వ అధికారులను కోరారు.