Telangana | కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ అంబర్‌పేటలో వీహెచ్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును బుధవారం తెల్లవారుజామున దుండగులు ఓ వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీహెచ్ ఫిర్యాదుతో అంబర్‌పేటలోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని వీహెచ్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సీసీ ఫుటేజ్.. కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టిన కారు
తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి ధ్వంసం చేసిన మరొక కారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వి.హనుమంతరావు. https://t.co/xAVls0dHfG pic.twitter.com/6YbFsPBaTe
— Telugu Scribe (@TeluguScribe) November 27, 2024
కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టిన వాహనం
తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేసిన దుండగులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వి.హనుమంతరావు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/x3ApfSbuFl
— Telugu Scribe (@TeluguScribe) November 27, 2024