చెన్నూర్, అక్టోబర్ 10 : ‘నాది ప్యూర్ కాంగ్రెస్ పార్టీ. శాసన సభ ఎన్నికల్లో మంత్రి వివేక్, పార్లమెంట్ ఎన్నికల్లో అతడి కుమారుడు వంశీకృష్ణను కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. అదే మేము చేసిన మొదటి తప్పు. ఆ తప్పును సవరించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో వీరిని ఓడించి, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గెలిపించుకుంటాం. ఇది వివేక్‌కు హెచ్చరిక అనుకున్నా, విజ్ఞప్తి అనుకున్నా పర్వాలేదు. ఆయన ఏ విధంగా స్వీకరించినా ఒరిగేది ఏమీలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామ ని హెచ్చరిస్తున్నాం’ అంటూ మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముత్యాల రవికుమార్‌గౌడ్ బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన కాంగ్రెస్ బాకీ కార్డులు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం మాట్లాడారు. ఆయన మాటలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనం సృష్టించింది.
‘పదేళ్ల నుంచి అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తండ్రీ కొడుకులైన వివేక్‌వెంకటస్వామి, వంశీకృష్ణను గెలిపించుకున్నాం. పోలీసుస్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే సెక్షన్ల నమోదుకు పోలీసులు ఖర్చు అవుతుందంటూ బహిరంగంగా దోచుకుంటున్నారు. ప్రజల, ప్రభుత్వ భూములకు రక్షణ లేదు. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం సందర్భంగా తనను గెలిపిస్తే ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆ స్తులకు రక్షణ ఉంటుందని ప్రమాణం చేశారు. సర్వే నంబర్ 869/2 గల ప్రభుత్వ భూమి ఒక డబ్బుగల వానికి ఎలా పట్టా మార్పిడి అయిందో మంత్రి వివేక్ తెలపాలి. బాల్క సుమన్ ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఇసుక మాఫియాను మీ రు అడ్డుకున్నారా? మైనింగ్ మంత్రి కూడా మీరేకదా..? మీరు ఏమి చేస్తున్నట్టు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరినీ మోసం చేసిన చరిత్ర వివేక్‌కే దక్కుతున్నది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకపోతే, సొంతంగా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 42 వేల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మాటలు నిజం కాదా..? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ప్రశ్నించే హక్కుంది కాబ ట్టి అడుగుతున్న. ఎంపీగా వంశీ గెలిచిన తర్వాత చెన్నూర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చెప్పాలి. చెన్నూర్‌లో ఇంటిని ని ర్మించుకోవడానికి అనుమతి కావాలంటే 2 లక్షలు కావాలి. రైతులకు భూములు పట్టాలు కావాలంటే రూ. 50 వేలు ఇవ్వాలి. మిమ్ము లను గెలిపించుకొని చెన్నూర్ నియోజకవర్గా న్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టేసుకున్నట్టు అయింది . నియోజకవర్గ ప్రజలంతా రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి వివేక్‌కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకొనే బీఆర్ఎస్ నాయకుడు బాల్కను ఎమ్మెల్యేగా గెలిపిస్తా’ అని రవికుమార్‌గౌడ్ పేర్కొన్నారు.