హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మసతి, టీడీపీ మాజీ మహిళా నేత షకీలారెడ్డి మంగళవారం గులాబీ కండువా కప్పుకున్నారు. నందినగర్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అలీ మస్కతి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే ముస్లిం అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు.
బీఆర్ఎస్ సెక్యూలర్ విధానాలు నచ్చడం వల్లనే ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను విస్మరించిందని, వారి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ మాజీ నేత షకీలారెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి తాను బీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు.