సుల్తాన్‌బజార్,జనవరి 8: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. నారాయణస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో మల్లు రవి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలి వైఎస్ చనిపోయారని గుర్తుచేశారు. దీనికి సోనియాగాంధీ కారణం ఎలా అవుతారని ప్రశ్నించారు. నారాయణస్వామి వ్యాఖ్యలు సరికాదని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ అవాస్తవైన వార్తను వైరల్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ నమిండ్ల శంకర్‌కు తెలిపినట్టు వివరించారు.