Neelam Madhu | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య రాజకీయ పంచాయితీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పటాన్చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, నీల మధు మధ్య సయోధ్య కుదుర్చేందుకు మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో కొండా సురేఖ నీలం మధుతో కలిసి కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన భార్య సుధారాణిని కలిశారు. ఈ సందర్భంగా కాటా సుధారాణి.. కొండా సురేఖ ముందే నీలం మధుపై మండిపడ్డారు. దీంతో నీలం మధు ఏదో చెప్పబోతుండగా, సుధారాణి అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మర్యాదతోనే నీలం మధుని ఏమనలేకపోయాం. లేదంటే నీలం మధు చెంప పగలకొట్టాలనుకున్నా.. నా భర్తను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు.. మధుకి కామన్ సెన్స్ లేదంటూ సుధారాణి కడిగిపారేశారు. ఇక కొండా సురేఖ సుధారాణిని సముదాయించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు బీఎస్పీ తరపున పోటీ చేసి కాటా శ్రీనివాస్ ఓటమికి కారణం అయ్యారని ఆయన అనుచరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంత చేసినా కూడా మళ్లీ నీలం మధును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని కాటా శ్రీనివాస్ వ్యతిరేకించారు. తన గెలుపును అడ్డుకున్న నీలం మధుకి టికెట్ ఎలా ఇస్తారని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
నీలం మధు చెంప పగలకొడతానన్న పటాన్చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ బార్య సుధారాణి
మంత్రి కొండా సురేఖ ముందే నీలం మధును తిట్టిన కాటా సుధారాణి.
నీలం మధు చెంప పగలకొట్టాలి అనుకున్న.. నీలం మధుకి కామన్ సెన్స్ లేదు అంటూ మంత్రి కొండా సురేఖ ముందు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి… https://t.co/jFHDzPBZ1P pic.twitter.com/fmDRJ9TeCk
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2024