Jaggareddy | సంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): పదిసార్లు ఫోన్‌చేసినా నా ఫోన్ ఎత్తనందుకు కలెక్టర్‌ను తిట్టానంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జన్మదిన వేడుకలను జూలై మాసం లో మైనార్టీ నాయకులు నాల్సాబ్గడ్డ చౌర స్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి తాను కలెక్టర్‌ను తిట్టానంటూ ఉర్దూలో చేసిన వ్యాఖ్యలు శుక్రవారం వైరల్ అయ్యాయి. జగ్గారెడ్డి తన సొంత జిల్లా సం గారెడ్డి కలెక్టర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పటికీ.. కలెక్టర్ పేరును ప్రస్తావించలేదు. గతంలో పనిచేసిన కలెక్టరా లేక ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గురించి జగ్గారెడ్డి మాట్లాడారా అన్నది స్పష్టంగా తెలియలేదు.
ఉర్దూలో ఆయన ప్రసంగం ఇలా కొనసాగింది. ‘కలెక్టర్‌కు పదిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తలేదు. కలెక్టర్ నా ఫోన్ ఎత్తకపోవటంతో బాగా కోపం వచ్చింది. ఇంట్లో ఏం చేస్తున్నారు కలెక్టర్ అని పీఏను అడిగా ను. నాకు కోపం వస్తే ఎలా తిడతానో ఎవరికైనా తెలుసా, ఎలా తిడతానో మీకు తెలుసుగా. నేను పీఏకు చెప్పాను అరే భాయ్ మీ కలెక్టర్ సాబ్ ఫోన్ ఎత్తటంలేదు, కలెక్టర్ ఆఫీసుకు రావటంలేదు, ఇంట్లో పడుకుంటున్నారు. క్యా మర్ద్కే బాజుక్ సోగయా క్యా (భర్త పక్కన పడుకున్నారా) అని అడి గా. నేను ఏమిచెప్పానో మీకు అర్థమైంది క దా! అర్థమైందా? లేదా? ఏక్ మరద్.. మ రద్కే బాజుక్ సోగయా క్యా బోల్కే బోలా. ఇలా తిట్టగానే ఐదు నిమిషాల్లో కలెక్టర్ లైన్లోకి వచ్చారు. అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు.. పవర్ ఉన్నా లేకున్నా జగ్గారెడ్డి గొంతుకకు (అవాజ్) దమ్ము విలువ ఉం టుంది..’ అంటూ వ్యాఖ్యానించారు.