హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం లేదని, రివేంజ్ పాలిటిక్స్ చేస్తే పశ్చాత్తాపం తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని, రాజకీయంగా యుద్ధం చేసి గెలిచేందుకు ఇష్టపడుతానని చెప్పారు. సోమవారం సెంట్రల్ కోర్టులో మీడియాతో చిట్‌చాట్ చేసిన జగ్గారెడ్డి అధికారంలో ఉన్నాం కదా అని ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిండం తాత్కాలికమైన చర్యగా అభివర్ణించారు. సంగారెడ్డిలో తన ఓటమిపైనా జగ్గారెడ్డిల అభిప్రాయాలు పంచుకున్నారు. ఓ ప్రధాన సామాజికవర్గం ఓట్లు వేయకపోవడం వల్లే ఓడిపోయినట్టు చెప్పారు. 2023 సాధారణ ఎన్నికలకు 6 నెలల ముందు తనకు పోటీ చేసే ఆలోచనే లేదని తెలిపారు. ఏ రాజకీయ నాయకుడైనా పైసలు తీసుకోకుండా రాజకీయం చేయగలరా అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.